ఫుట్‌బాల్‌ లెజెండ్‌ చునీ గోస్వామి మృతి

ABN , First Publish Date - 2020-05-01T09:40:36+05:30 IST

భారత ఫుట్‌బాల్‌ లెజెండ్‌ సుబిమల్‌ చునీ గోస్వామి గుండె పోటుతో మరణించాడు. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ ...

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ చునీ గోస్వామి మృతి

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ లెజెండ్‌ సుబిమల్‌ చునీ గోస్వామి గుండె పోటుతో మరణించాడు. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత ఫుట్‌బాల్‌ జట్టుకు గోస్వామి సారథ్యం వహించాడు. బెంగాల్‌  తరఫున రంజీ ట్రోఫీలోనూ ఆడాడు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల  గోస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అతడి కుమారుడు సుదీప్తో గురువారమిక్కడ తెలిపాడు. గోస్వామి 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌ ఆసాంతం మోహన్‌ బగాన్‌ క్లబ్‌ తరఫున ఆడిన చునీ 1968లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఫుట్‌బాలర్‌గానే కాకుండా క్రికెటర్‌గానూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. 1962-73 వరకు బెంగాల్‌ తరఫున 46 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, మీడియం పేసర్‌గా రాణించాడు. 1971-72 రంజీ సీజన్‌లో బెంగాల్‌ టీమ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 

Updated Date - 2020-05-01T09:40:36+05:30 IST