చీకటిని కాదు... వెలుగును చూద్దాం!

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ కచ్చితంగా విపత్తే! కానీ ప్రపంచాన్ని అంతం చేసే మహాప్రళయం కాదు. మానవాళి ఇలాంటి ముప్పులతో ఇంతకు ముందు చాలాసార్లు పోరాడింది. గెలిచింది! ఈ పోరాటంలోనూ మనం...

చీకటిని కాదు... వెలుగును చూద్దాం!

  • కరోనా వైరస్‌ కచ్చితంగా విపత్తే! కానీ ప్రపంచాన్ని అంతం చేసే మహాప్రళయం కాదు. మానవాళి ఇలాంటి ముప్పులతో ఇంతకు ముందు చాలాసార్లు పోరాడింది. గెలిచింది! ఈ పోరాటంలోనూ మనం గెలుస్తాం! ఆ ఆశతోనే ముందుకు సాగుదాం!!


ధ్యానం, ప్రార్థనలూ అత్యున్నతమైనవి. మిగిలిన రకరకాల తంతుల కన్నా వీటి ప్రభావం ఎక్కువ. ఇప్పుడు దొరికిన ఏకాంతాన్ని దాని కోసం వినియోగించుకుందాం. భౌతిక దూరం, నిశ్శబ్దం, ఏకాంతం అనేవి శిక్షలు కాదు. వ్యక్తిగత పురోభివృద్ధికీ, స్వీయ పునరుద్ధరణకూ ఇవి మార్గాలు. ప్రపంచంలో ఎన్నో గొప్ప గ్రంథాలూ, కళాత్మక సృజనలూ ఏకాంతంలోంచే పుట్టాయి.

అంటువ్యాధులు చెలరేగుతున్న సమయంలో తోటివారికి చేయి అందించడం మన బాధ్యత. రోజు కూలీతో బతికేవారికీ, తక్కువ వేతనాలతో బతుకు సాగించేవారికీ సాయం అందిద్దాం. 


అనిశ్చితిలో ఇది తాత్కాలికమైన దశ మాత్రమే! నల్లటి మేఘాలు ఆకాశం మీద ముసురుకొచ్చినా ఆశాకిరణాల్లా వాటికి వెండి అంచులు మెరుస్తూ ఉంటాయి. చీకటికి బదులు వాటిని చూడాలి. మనలో ఆశ పెంచుకోవాలి. చుట్టూ ఉన్నవారికి దాన్ని పంచాలి. కాలం ఎలాంటి బాధనైనా మాన్పుతుంది. కాకపోతే దానికి కొంచెం సమయం ఇవ్వాలి. ఆ సమయంలో సహనంగా, ధైర్యంగా, దయతో ఉండాలి.

-శ్రీ శ్రీ రవి శంకర్‌

(ఆధ్యాత్మిక గురువు, 

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు)


Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST