ఉద్యోగానికి ఎట్టాపోతావో చూస్తానంటూ భార్య చేతులు, కాలు విరగ్గొట్టాడు

ABN , First Publish Date - 2020-05-01T18:44:12+05:30 IST

కరోనా కష్ట కాలంలోనూ ఆమె క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులకు హాజరవుతున్నారు. దాంతో చుట్టుపక్కలోళ్లు ఆమెను అభినందిస్తుంటే.. కట్టుకున్నోడు మరింత ప్రోత్సహించాల్సి పోయి ఉద్యోగం మానేయాలని పట్టుబట్డాడు.

ఉద్యోగానికి ఎట్టాపోతావో చూస్తానంటూ భార్య చేతులు, కాలు విరగ్గొట్టాడు

తిరుపతి (ఆంధ్రజ్యోతి): కరోనా కష్ట కాలంలోనూ ఆమె క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులకు హాజరవుతున్నారు. దాంతో చుట్టుపక్కలోళ్లు ఆమెను అభినందిస్తుంటే.. కట్టుకున్నోడు మరింత ప్రోత్సహించాల్సి పోయి ఉద్యోగం మానేయాలని పట్టుబట్డాడు. చివరకు తాను చెప్పిన మాట వినలేదని‘ఉద్యోగానికి ఎట్టా పోతావో చూస్తానంటూ’ఓ ఇనుపరాడ్డుతో చేతు లు, కాలు విరగొట్టి పరారయ్యాడు. ఐదేళ్లుగా తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వైద్యులకు సహాయకురాలిగా (సపోర్టింగ్‌ స్టాఫ్‌) త్రివేణి  పనిచేస్తున్నారు. దుర్గసముద్రానికి చెందిన ట్రావెల్స్‌ డ్రైవర్‌ చరణ్‌తో ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. తిరుపతి అనంతవీధిలో కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. 


ఉన్నత విద్య చదువుకున్న త్రివేణి ఉద్యోగం మానేయడానికి ఒప్పుకోలేదు. ఈక్రమంలో గురువారం పిల్లలను తన స్వస్థలమైన దుర్గసముద్రానికి భర్త తీసుకెళ్లాడు. డ్యూటీ నుంచి వచ్చిన త్రివేణికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడింది. ఆరా తీస్తే భర్త తీసుకెళ్లాడని తెలిసింది. బిడ్డలను చూడటానికి దుర్గ సముద్రం వెళ్లగానే భర్త ఓ ఇనుపరాడ్‌ తీసుకుని విచక్షణారహితంగా దాడిచేశారు. రెండు చేతులు, కుడి కాలుకు తీవ్రంగా గాయాల య్యాయి. సమాచారం తెలుసుకున్న త్రివేణి సోదరు డు శ్రీనివాసులు గాయపడిన ఆమెను రుయాస్పత్రికి తర లించాడు.రుయాలో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. రుయా..కోవిడ్‌-19 ఆస్పత్రిగా రూపొందించిన పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో నగరంలోని డీబీఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అంతకుముందు చాలాసేపటి దాకా అంబులెన్స్‌ అక్కడికి రాకపోవడంతో బాధితురాలు గాయాలతో రుయాస్పత్రి వద్ద తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనపై ఎంఆర్‌ పల్లె సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యం లో ఎస్‌ఐ ప్రకాష్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసు లు తెలిపారు. 

Updated Date - 2020-05-01T18:44:12+05:30 IST