లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీలో జీరో సేల్స్

ABN , First Publish Date - 2020-05-01T17:19:57+05:30 IST

లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీ ఏప్రిల్ నెలలో జీరోసేల్స్ తో కంపెనీ వెనుకబడింది.....

లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీలో జీరో సేల్స్

బెంగళూరు : లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీ ఏప్రిల్ నెలలో జీరోసేల్స్ తో కంపెనీ వెనుకబడింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలోమారుతీ సుజుకీలో మార్చి 22వతేదీ నుంచి కార్ల విక్రయాలు, ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా ప్రభావం కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించలేదని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారి మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించక పోవడం విశేషం. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 35వేలు దాటడంతోపాటు 1147 మంది మరణించడంతో కార్ల ఉత్పత్తితో పాటు విక్రయాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-05-01T17:19:57+05:30 IST