ఇలా జరగడం మారుతి సుజుకి చరిత్రలో తొలిసారి!

ABN , First Publish Date - 2020-05-01T22:37:50+05:30 IST

దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యంత చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఏప్రిల్

ఇలా జరగడం మారుతి సుజుకి చరిత్రలో తొలిసారి!

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యంత చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఏప్రిల్ నెలలో కంపెనీ ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది. నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోవడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతోపాటు షోరూమ్‌‌లను కూడా మూసివేసింది. ఫలితంగా విక్రయాలు నిలిచిపోయాయి.


ఫలితంగా మారుతి సుజుకి ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది. నిజానికి దేశంలోనే అత్యధిక కార్లను విక్రయించే రికార్డు మారుతి సొంతం. అయితే, లాక్‌డౌన్ ప్రభావం ఆ సంస్థపై భారీగానే పడింది. మార్చిలోనూ మారుతి అమ్మకాలు 47.4 శాతం పడిపోయింది. మారుతి సుజుకి ప్రతి నెల 1.50 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తుంది. 

Updated Date - 2020-05-01T22:37:50+05:30 IST