లాక్‌డౌన్‌లో ఇబ్బందులున్నా ప్రజలు సహకరించాలి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-05-01T23:50:17+05:30 IST

కూరగాయలు అందుబాటులోనే ఉన్నాయని, నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉన్నాయని, కరోనా వైరస్‌ కంట్రోల్‌లోనే ఉందని, అయితే మరికొంత కాలం లాక్‌డౌన్‌ పాటించి ఆ వైరస్‌ను అంతం చేయాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్‌లో ఇబ్బందులున్నా ప్రజలు సహకరించాలి- ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: కూరగాయలు అందుబాటులోనే ఉన్నాయని, నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉన్నాయని, కరోనా వైరస్‌ కంట్రోల్‌లోనే ఉందని, అయితే మరికొంత కాలం లాక్‌డౌన్‌ పాటించి ఆ వైరస్‌ను అంతం చేయాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకుర్తి నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. కుందారంలో ఉపాధి కూలీలను పలుకరించారు. ఎల్లరాయిని తొర్రూరులో కార్మికులకు సాయమందించారు. పాలకుర్తిలో కూరగాయలు అమ్ముతున్న రైతులను, ప్రజలను పలుకరించారు. పాలకుర్తితో సహా పలు ధాన్యంకొనుగోలు కేంద్రాల వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. మాస్కులను అందజేశారు. కొలన్‌పల్లె, మైలారం గ్రామాల్లో నిరుపేదలకు మాస్కులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆయా సందర్బాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు లాక్‌డౌన్‌ కరోనా నివారణకు సిసలైన మందు అని చెప్పారు.


ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. నిరుపేదలను ఆదుకోవాలని, కష్టకాలంలో ఆదుకున్నవాడే అసలైన మనీషి అని చెప్పారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషినీ, మస సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలు అర్దం చేసుకున్నారని అన్నారు. కష్టకాలంలో కరువు పనులు ఎంతో మేలు చేస్తాయన్నారు. కూలీలు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలన్నారు. పనులుచేసే సమయంలో సామాజిక దూరం పాటించాలన్నారు. ఉపాధి పనుల కింద ఉపయోగపడే పనులే చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్ధిక సమస్యలన లెక్కచేయకుండా పేదలను ప్రజలను , రైతులను ఆదుకోవాలని నిర్ణయించారన్నారు. కేసీఆర్‌ ఔదర్యాన్ని ప్రజలు అందరు అర్ధం చేసుకోవాలన్నారు. ఆస్పూర్తిని గ్రామాల్లోకొనసాగించాలని విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2020-05-01T23:50:17+05:30 IST