ఆన్‌లైన్ పోర్టల్‌కు వెల్లువెత్తిన దరఖాస్తులు..

ABN , First Publish Date - 2020-05-01T15:47:28+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు నిర్భందంలోకి వెళ్లిపోయాయి. కాగా.. ఇప్పుడిప్పడే

ఆన్‌లైన్ పోర్టల్‌కు వెల్లువెత్తిన దరఖాస్తులు..

యూఏఈ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు నిర్భందంలోకి వెళ్లిపోయాయి.  కాగా.. ఇప్పుడిప్పడే కొన్ని దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. విదేశాల్లో చిక్కుకున్న తమ దేశాల పౌరులను తిరిగి స్వదేశానికి తరలించడానికి ప్రణాళికలు రూపొందుస్తిన్నాయి. భారత ప్రభుత్వం కూడా విదేశాల్లో ఉన్న భారత పౌరులను దశల వారీగా ఇండియాకు తరలించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా..గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులను మొదటగా భారత్‌కు తరలించాలని చూస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల డేటాను సేకరించడం కోసం ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాయి. కాగా.. బుధవారం ప్రారంభమైన పోర్టల్‌కు విశేష స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 8 గంటల వరకు సుమారు 50వేల మంది ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారని దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-05-01T15:47:28+05:30 IST