ఫోన్‌ చేస్తే.. ఇంటికే మామిడి!

ABN , First Publish Date - 2020-05-01T10:14:03+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో నాణ్యమైన మామిడి పండ్లను వినియోగదారుల ఇంటికి పంపించే ప్రక్రియకు రాష్ట్ర ఉద్యానశాఖ శుక్రవారం నుంచి శ్రీకారం చుడుతోంది.

ఫోన్‌ చేస్తే.. ఇంటికే మామిడి!

 నేటి నుంచే బుకింగ్స్‌, డోర్‌ డెలివరీ

తపాలా శాఖ ద్వారా పార్శిల్‌ పంపిణీ 

ఐదు కిలోల బాక్సు ధర రూ. 350 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో నాణ్యమైన మామిడి పండ్లను వినియోగదారుల ఇంటికి పంపించే ప్రక్రియకు రాష్ట్ర ఉద్యానశాఖ శుక్రవారం నుంచి శ్రీకారం చుడుతోంది. ఫోన్‌ చేసి ఆర్డర్‌ చేస్తే... 5 కిలోల మామిడి పండ్ల బాక్సును తపాలా శాఖ సౌజన్యంతో అందించేందుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. తోట నుంచి పరిపక్వ దశకు చేరిన మామిడి కాయలను సేకరించి, ఉద్యానశాఖ సిబ్బంది పర్యవేక్షణలో సహజ పద్ధతిలో మాగ బెట్టి వినియోగదారులకు అందిస్తామని ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి తెలిపారు. 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల కార్టన్‌ బాక్సు ధర డెలివరీ ఛార్జీలతో కలిపి రూ. 350 గా నిర్ణయించినట్లు తెలిపారు.


మే ఒకటో తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 79977 24925, 79977 24941 నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో ఉన్నవారికే ఈ సేవలు అందిస్తామని చెప్పారు. వినియోగదారులు ఆర్డర్‌ విలువను గూగూల్‌పే, ఫోన్‌పే ద్వారా 79977 24925 నెంబర్‌కు పంపించ వచ్చని సూచించారు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా పంపాలనుకునేవారు అకౌంట్‌ నెంబర్‌- 013910100083888 (ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఏఎన్‌డీబీ0000139) ఆంధ్రాబ్యాంక్‌, గగన్‌ మహల్‌ బ్రాంచికి పంపించాలని సూచించారు. ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత 4- 5 రోజుల వ్యవధిలో డెలివరీ ఇవ్వనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-05-01T10:14:03+05:30 IST