రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2020-09-01T18:57:07+05:30 IST

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ నిరవధిక వాయిదా పడింది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ నిరవధిక వాయిదా

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ నిరవధిక వాయిదా పడింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసు పెండింగ్‌లో ఉండగా ఎలా జోక్యం చేసుకోవాలని హైకోర్టు ప్రశ్నించింది.తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అదనపు ఏజీ రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందని రామచంద్రరావు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతోందన్నది వివాదమని అదనపు ఏజీ తెలిపారు.


ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయని ఏపీ ఏజీ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఏపీ ఏజీ శ్రీరాం పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ హైకోర్టు నిరవధిక వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకురావచ్చని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.

Updated Date - 2020-09-01T18:57:07+05:30 IST