లింగంపల్లి నుంచి శుక్రవారం తెల్లవారుజామున కూత పెట్టిన రైలు అసలు కథ ఇది..

ABN , First Publish Date - 2020-05-01T18:28:42+05:30 IST

వలస కార్మికుల కోసం దేశంలోనే తొలి రైలు తెలంగాణ నుంచి కదిలింది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన...

లింగంపల్లి నుంచి శుక్రవారం తెల్లవారుజామున కూత పెట్టిన రైలు అసలు కథ ఇది..

లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కు ఒక్క ట్రైన్‌లో 1200 మంది వలస కార్మికుల తరలింపు


హైదరాబాద్: వలస కార్మికుల కోసం దేశంలోనే తొలి రైలు తెలంగాణ నుంచి కదిలింది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తరలించేందుకు లింగంపల్లి నుంచి తెల్లవారుజామున 4.50 నిమిషాలకు ప్రత్యేక రైలు బయల్దేరింది. లింగంపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలు జార్ఖండ్‌లోని హాటియా వరకూ వెళ్లనుంది.


ఈ వలస కార్మికుల్లో దాదాపు 500 మంది సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో పనిచేస్తున్న వారిగా తెలిసింది. వీరిని 57 బస్సుల్లో ఐఐటీ క్యాంపస్ నుంచి లింగంపల్లి స్టేషన్‌కు తెల్లవారుజామున తరలించినట్లు సమాచారం. మొత్తం 1200 వలస కార్మికులను 22 కోచ్‌లు కలిగిన ఈ ప్రత్యేక రైలులో తరలించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి తెలిపారు. 


ఈ ప్రత్యేక రైలులో వలస కార్మికులకు తాగునీరు, భోజన సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్లు తెలిసింది. జార్ఖండ్‌లోని హాటియాకు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రత్యేక రైలు చేరుకుంటుందని ఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైలులో జార్ఖండ్‌కు చేరుకునే వారికి క్వారంటైన్, టెస్టింగ్ ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.





Updated Date - 2020-05-01T18:28:42+05:30 IST