ప్రణబ్‌ మృతికి క్రీడాలోకం నివాళి

ABN , First Publish Date - 2020-09-01T09:40:15+05:30 IST

శీతాకాల విడిదిలో భాగంగా 2016లో హైదరాబాద్‌లో బస చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం ..

ప్రణబ్‌ మృతికి క్రీడాలోకం నివాళి

శీతాకాల విడిదిలో భాగంగా 2016లో హైదరాబాద్‌లో బస చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  గౌరవార్థం నాటి గవర్నర్‌ ఇచ్చిన విందులో పాల్గొన్న గోపీచంద్‌ దంపతులు, సానియా, సింధు


దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి సేవలందించారు. ఆయన మృతి విచారకరం. వారి కుటుంబానికి  నా ప్రగాఢ సానుభూతి.

- సచిన్‌ టెండూల్కర్‌

ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఆయన మృతి వార్త తీవ్రంగా కలచివేసింది.

 - విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై దేశంలోని క్రీడా ప్రముఖులు తమ సంతాపం వెలిబుచ్చారు. 

ఆయన మాకు మార్గదర్శి. దేశానికి ఆయన చేసిన సేవల చిరస్మరణీయం.

- క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు

మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ఇక లేరన్న వార్త బాధ కలిగించింది. ఆయన ఆత్మకు సద్గతి లభించాలి.


- వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. వారి కుటుంబానికి నా సానుభూతి. 

- రోహిత్‌ శర్మ

ప్రణబ్‌ జీ మృతికి నా హృదయపూర్వక నివాళి ప్రకటిస్తున్నా. 

- వీరేంద్ర సెహ్వాగ్‌

ఆయన సేవలను దేశం గుర్తుంచుకుంటుంది. అందరూ ప్రేమించే నేతగా ప్రణబ్‌ పేరు తెచ్చుకున్నారు.


- గౌతం గంభీర్‌

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరనే విషయం విచారం కలిగించింది.

- సైనా నెహ్వాల్‌

రాజకీయాల్లో అత్యున్నత నేతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు.


- విజేందర్‌ 

ప్రణబ్‌ ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి.


- మేరీకోమ్‌

Updated Date - 2020-09-01T09:40:15+05:30 IST