భారత్‌లో చిక్కుకున్న బ్రిటన్ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు..!

ABN , First Publish Date - 2020-05-01T17:36:26+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకున్న తమ దేశ పౌరువులను తరలించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మార్చి 5 నుంచి 11 మధ్య అమృత్‌సర్-

భారత్‌లో చిక్కుకున్న బ్రిటన్ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు..!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకున్న తమ దేశ పౌరువులను తరలించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మార్చి 5 నుంచి 11 మధ్య అమృత్‌సర్-లండన్‌కు ఏడు ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మొత్తం 13వేల మంది బ్రిటన్ పౌరులు చిక్కుకున్నారని బ్రిటన్ పేర్కొంది. వారిని స్వదేశానికి తరలించేందుకు మొత్తం 52 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా భారత్‌లో చిక్కుకున్న సుమారు 2వేల మంది కోసం ఏడు ప్రత్యేక విమానాలను ఇండియాకు పంపుతున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. కాగా.. భారత ప్రభుత్వ కూడా ఇతర దేశాల్లో చిక్కుకున్న మన దేశ పౌరువులను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో 1.71లక్షల మందికి వైరస్ సోకింది. దాదాపు 27వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. 


Updated Date - 2020-05-01T17:36:26+05:30 IST