సీపీఎస్ విషయంలో కమిటీల పేరుతో కాలయాపన వద్దు: సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-09-01T19:04:28+05:30 IST

సీపీఎస్ రద్దు కోరుతూ 2016 సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ఏడాది ఈరోజును బ్లాక్‌డే గా పాటిస్తున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేపేటి సత్యనారాయణ తెలిపారు.

సీపీఎస్ విషయంలో కమిటీల పేరుతో కాలయాపన వద్దు: సత్యనారాయణ

విజయవాడ: సీపీఎస్ రద్దు కోరుతూ 2016 సెప్టెంబర్ 1 నుంచి  ప్రతి ఏడాది  ఈరోజును బ్లాక్‌డే గా పాటిస్తున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేపేటి సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేరలేదని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగుల బాధను అర్ధం చేసుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా సీపీఎస్ రద్దు చేయలేదన్నారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని... కమిటీలు పేరుతో కాలయాపన చేయవద్దని సత్యనారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-01T19:04:28+05:30 IST