బుట్ట బొమ్మా.. పాటకు వార్నర్‌ స్టెప్పులు

ABN , First Publish Date - 2020-05-01T09:41:45+05:30 IST

అల.. వైకుంఠపురంలోని ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్ని వర్గాల వారినీ ఆ పాట విపరీతంగా ...

బుట్ట బొమ్మా.. పాటకు వార్నర్‌ స్టెప్పులు

సిడ్నీ: అల.. వైకుంఠపురంలోని ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్ని వర్గాల వారినీ ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ తెలుగు సాంగ్‌పై ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా మనసు పారేసుకున్నాడు. ఏకంగా తన భార్య క్యాండి్‌సతో కలిసి బుట్ట బొమ్మా.. అంటూ స్టెప్పులతో అదరగొట్టాడు. దీంట్లో తన రెండో కూతురు కూడా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఈ వీడియోను టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. అలాగే ఈ పాటకు వార్నర్‌ తన ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జెర్సీ ధరించి మరీ డ్యాన్స్‌ చేయడం విశేషం. ఇంతకుముందు కూడా వార్నర్‌ బాలీవుడ్‌ సాంగ్‌ షీలా కీ జవానీ సాంగ్‌కు తన కూతురు ఇండీతో కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియోను కూడా పోస్ట్‌ చేశాడు.

Updated Date - 2020-05-01T09:41:45+05:30 IST