వైసీపీ నేతల ‘సోషల్‌’ జులుం!

ABN , First Publish Date - 2020-09-01T09:44:54+05:30 IST

అక్రమ మైనింగ్‌పై సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారంటూ ఓ టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చూస్తుండగానే,

వైసీపీ నేతల ‘సోషల్‌’ జులుం!

  • అక్రమ మైనింగ్‌పై పోస్టులు పెట్టారని
  • ఓ టీడీపీ నేతపై దాడి.. ముష్టిఘాతాలు
  • వైసీపీ ఎంపీ నందిగం ఎదుటే దౌర్జన్యం


ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31: అక్రమ మైనింగ్‌పై సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారంటూ ఓ టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చూస్తుండగానే, దుర్భాషలాడుతూ, ముష్టిఘాతాలు కురిపించారు. ఈ దాడిలో నందిగామ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు.. సోమవారం కృష్ణాజిల్లా కొండపల్లి రిజర్వు ఫారెస్టు అక్రమ మైనిం గ్‌ పరిశీలనకు వెళ్లి వస్తూ టీడీపీ నేతలు ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేసేందు కు ఆగారు. అదే సమయంలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ తన అనుచరులతో కలిసి భోజనం చేసి బయటకు వస్తున్నారు. టీడీపీ బృందంలో అజయ్‌ను చూసిన వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ‘‘సోషల్‌ మీడియాలో మా నేతపై పోస్టులు పెడతా వా? అక్రమ మైనింగ్‌పై మాట్లాడతావా?’’ అంటు  పిడిగుద్దులు కురిపించారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌లో బాధితుడు అజయ్‌, టీడీపీ నేతలు ఫిర్యా దు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ  చెప్పారు. 


ఇంత దుర్మార్గమా: బాబు 

కొండపల్లి రిజర్వ్‌ ఫారె్‌స్టలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిందిగాక దానిని ఎత్తిచూపినందుకు టీడీపీ ప్రతినిధి బృందంపై వైసీపీ నేతలు దాడికి దిగడం దుర్మార్గమ ని టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే, ఆయన బంధువులే కొండపల్లి అక్రమ మైనింగ్‌ సూత్రధారుల ని, వాళ్ల దోపిడీ బట్టబయలు చేశారన్న అక్కసుతోనే టీడీపీ నేతల బృందంపై దాడిచేశారని అన్నారు.

Updated Date - 2020-09-01T09:44:54+05:30 IST