AP News.. నకిలీ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని వైసీపీ, బీజేపీ కుట్రలు: శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2022-11-17T11:05:42+05:30 IST
తిరుపతి: శాసనమండలి ఎన్నికలలో ప్రజాస్వామ్యం గొంతు నులిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.
తిరుపతి: శాసనమండలి ఎన్నికలలో ప్రజాస్వామ్యం గొంతు నులిమేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నకిలీ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని వైసీపీ, బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిజమైన ఓటర్ల గుర్తింపుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లతో అభిప్రాయాలను సేకరించి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను బెదిరింపులకు అధికార పార్టీ పాల్పడుతోందన్నారు. ఉపాధ్యాయులు, డిఈవోలను ప్రభుత్వం వేధించడంతో పాటు బదిలీలతో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ అంశాలపై ఎన్నికల సంఘం కూడ అధికార పార్టీ నేతలకు భయపడుతోందన్నారు. మీటర్లు పెడితే విద్యుత్ నాణ్యత ఎలా పెరుగుతుందో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరూపించాలన్నారు. అవగాహన లేకుండా మంత్రి మాట్లాడటం తగదని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 30ఏళ్లు రైతులకు ఉచిత విద్యుత్ చేస్తామని చట్టం చేయాలని శ్రీనివాసరావు అన్నారు.