Home » LATEST NEWS
Open Spotify: రోజంతా కష్టపడి అలసిపోయారా..తీవ్ర ఒత్తిడి మిమ్మల్ని బాధిస్తోందా.. విసుగ్గా.. చిరాగ్గా.. ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. అయితే, మీరు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం కల్పించేందుకు ముందుకొస్తోంది మీ అభిమాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
Rewind 2024: ఈ ఏడాది క్రికెట్‌కు పలువురు మ్యాచ్ విన్నర్లు గుడ్‌బై చెప్పారు. తమ ఆటతో ఏళ్ల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ప్లేయర్ల నిష్క్రమణ అందర్నీ నిరాశలో ముంచేసింది. మరి.. క్రికెట్‌కు అల్విదా చెప్పిన ఆ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆయనో మోనార్క్. తన నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తారు. అక్కడ తాను చెప్పిందే వేదం..చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తారు. అధికారులు చేయాల్సిన పనులనూ తానే చేసేస్తారు. తనకు ఎదురు చెబితే..
ఈ ఏడాది మీ జీవితం సమూలంగా మార్చుకోవాలని ఉందా? మెడిటేషన్‌తో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవితానికి కావాల్సిన మానసిన, శారీరక మేథో సామర్థ్యాలన్నీ ధ్యానంతో సంతరించుకోవచ్చని చెబుతున్నారు.
కొంపల్లి సుచిత్రా సర్కిల్(Kompally Suchitra Circle) పరిధిలోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉలవ చారు, మల్నాడు కిచెన్, ట్రైన్థీన్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీ లు చేయగా కుళ్ల్లిపోయిన టమా టాలు, నాన్‌వెజ్(Non-veg)లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు వంటగది అధ్వానస్థితిలో ఉండి బొద్దింకలు తిరగడం అధికారులు గుర్తించారు.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.
కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిని కారుతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు.
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14, 15 రెండు రోజుల పాటు సీఎం బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తర్వాత 20వ తేదీ నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు హెచ్ఐసిసి నోవాటెల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు.