CPM Srinivasa Rao: విధ్వంసకర పాలకులకు జగన్ స్వాగతం పలకడమేంటి?

ABN , First Publish Date - 2022-11-08T16:37:30+05:30 IST

Nellore: దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీ (Prime Minister Modi)కి సీఎం జగన్ (CM Jagan) స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao).

CPM Srinivasa Rao: విధ్వంసకర పాలకులకు జగన్ స్వాగతం పలకడమేంటి?

Nellore: దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi)కి సీఎం జగన్ (CM Jagan) స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao). ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 11వ తేదీన ఆయన విశాఖపట్నం రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జగన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఏబీఎన్‌తో మాట్లాడారు.

‘‘ప్రధాని విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు. అయితే రైల్వేజోన్ వచ్చేస్తుందని విజయసాయి రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారు. పార్లమెంట్‌లో 22మంది ఎంపీలు ఉంటే.. ఏపీకి సంబంధించిన వాటిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. మెడలు వంచి రాజన్నపాలన తెస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం మోదీకి స్వాగతం పలుకుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం బాధాకరం. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు ఉక్కు కర్మాగార కార్మికులతో సమ్మె చేపడుతున్నాం. బీజేపీ, వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నిరంతరం పోరాటం చేస్తాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-08T16:56:06+05:30 IST