టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-10-27T04:22:45+05:30 IST

పెన్షన్లు, టిడ్కో ఇళ్ల కోసం ఎమ్మెల్యే కొడాలి నానీని గుడివాడలో ప్రజలు నిలదీశారు.

టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?

దరఖాస్తు చేసినా పింఛన్లు ఇవ్వడం లేదు

ఎమ్మెల్యే కొడాలిని నిలదీసిన జనం

గుడివాడ టౌన్‌, అక్టోబరు 26: పెన్షన్లు, టిడ్కో ఇళ్ల కోసం ఎమ్మెల్యే కొడాలి నానీని గుడివాడలో ప్రజలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన స్థానిక 15వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు ఆయన్ను అడ్డుకుని పెన్షన్‌ ఇవ్వడం లేదని చెప్పారు. టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. డబ్బు కట్టి నాలుగేళ్లవుతున్నా టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, ఎప్పుడిస్తారంటూ నిలదీశారు. వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని మరికొంతమంది ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఆయన అధికారులను పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్లను డిసెంబరు 21 జగన్‌ పుట్టినరోజున ఇస్తామని, మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-10-27T04:22:47+05:30 IST