Bank Holidays: నవంబరులో బ్యాంకులు మూతపడేది ఎన్ని రోజులంటే?
ABN , First Publish Date - 2022-10-31T16:36:46+05:30 IST
వరుస పండుగల కారణంగా అక్టోబరు నెలలో బ్యాంకులు (Banks) దాదాపు 21 రోజులు మూతపడ్డాయి. రాష్ట్రాలను
న్యూఢిల్లీ: వరుస పండుగల కారణంగా అక్టోబరు నెలలో బ్యాంకులు (Banks) దాదాపు 21 రోజులు మూతపడ్డాయి. రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో కొన్ని హెచ్చుతగ్గులున్నాయి. ఉత్తరాదిలో నేడు (అక్టోబరు 31) కూడా మూతపడ్డాయి. చాత్‌పూజ సందర్భంగా రిజర్వు బ్యాంకు (RBI) సెలవు ప్రకటించింది. అక్టోబరులో బ్యాంకులు కొన్ని రోజులు మాత్రమే పనిచేయడం వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. అక్టోబరుతో పోలిస్తే నవంబరులో బ్యాంకు సెలవులు (Bank Holidays) సాధారణంగానే ఉన్నాయి. మొత్తంగా పది రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో మూడు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక, రెగ్యులర్ సెలవులైన రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు మామూలే.
నవంబరులో సెలవులు ఇలా..
నవంబరు 1 : ‘కన్నడ రాజ్యోత్సవ’ సందర్భంగా కర్ణాటకలో, ‘కుట్’ (చవాంగ్ కుట్) పండుగ సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు.
నవంబరు 6: ఆదివారం
నవంబరు 8: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి/ రహాస్ పూర్ణిమ
నవంబరు 11: కనకదాస జయంతి, వంగల ఫెస్టివల్స్ సందర్భంగా కర్ణాటక, మేఘాలయలో బ్యాంకులకు సెలవు
నవంబరు 12: రెండో శనివారం
నవంబరు 13: ఆదివారం
నవంబరు 20: ఆదివారం
నవంబరు 23: సెంగ్ కుట్స్‌నెమ్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు
నవంబరు 26: నాలుగో శనివారం
నవంబరు 27: ఆదివారం