Work From Home: ఐటీ ఉద్యోగులకు శుభవార్త...
ABN , First Publish Date - 2022-12-09T07:03:50+05:30 IST
దేశంలోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త.దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఐటీ యూనిట్ల ఉద్యోగులకు వచ్చే ఏడాది...
న్యూఢిల్లీ: దేశంలోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త.దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఐటీ యూనిట్ల ఉద్యోగులకు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.(Centre Allows)దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని(Special Economic Zones) ఐటీ యూనిట్లలో వందశాతం ఉద్యోగులు(IT Employees) కొన్ని షరతులతో ఇంటి నుంచి పని చేయడానికి అనుమతిస్తూ కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించింది.
(Work From Home)‘‘ ఒక ఐటీ యూనిట్ తన ఉద్యోగులను ఇంటి నుంచి లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్ వెలుపల ఏదైనా ప్రదేశం నుంచి పని చేయడానికి అనుమతించవచ్చు’’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.షరతుల ప్రకారం స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని ఐటీ యూనిట్ల యజమానులు సంబంధిత జోన్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్‌కు వర్క్ ఫ్రం హోం గురించి తెలియజేసి, వారి ఆమోద పత్రం ప్రకారం ప్రాంగణంలో నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని కేంద్రం సూచించింది.
భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం (WFH)ని కోరుకునే యూనిట్‌లు సమాచారాన్ని ఈమెయిల్ చేయాలని కోరింది.ఇంటి నుంచి పని చేయడానికి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు,ఇతర పరికరాలను ఉద్యోగులకు అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది.