HP Layoffs: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ.. హెచ్‌పీ సంస్థ కూడానా..!
ABN , First Publish Date - 2022-11-23T21:06:19+05:30 IST
ఐటీ ఉద్యోగుల్లో (IT Employees) లే-ఆఫ్స్ ట్రెండ్ (Layoffs Trend) కలవరం రేపుతోంది. రోజుకో ఐటీ సంస్థ లే-ఆఫ్స్‌ను ప్రకటిస్తూ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అమెజాన్ (Amazon), మెటా (Meta), సేల్స్‌ఫోర్స్ (Salesforce), కాగ్నిజెంట్ (Cognizant) వంటి కంపెనీలు..
ఐటీ ఉద్యోగుల్లో (IT Employees) లే-ఆఫ్స్ ట్రెండ్ (Layoffs Trend) కలవరం రేపుతోంది. రోజుకో ఐటీ సంస్థ లే-ఆఫ్స్‌ను ప్రకటిస్తూ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అమెజాన్ (Amazon), మెటా (Meta), సేల్స్‌ఫోర్స్ (Salesforce), కాగ్నిజెంట్ (Cognizant) వంటి కంపెనీలు ఇప్పటికే కొందరు ఉద్యోగులను తప్పించి లే-ఆఫ్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలో దిగ్గజ సంస్థ Hewlett-Packard (HP) కూడా చేరింది. కంప్యూటర్లకు డిమాండ్ పడిపోవడంతో హెచ్‌పీ సంస్థ కూడా లే-ఆఫ్ బాటను (HP Layoffs) ఎంచుకుంది.
2025 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 6 వేల మంది ఉద్యోగులను తొలగించాలని హెచ్‌పీ యాజమాన్యం నిర్ణయించినట్లు రాయిటర్స్ (Reuters) పేర్కొంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా హెచ్‌పీ సంస్థలో పనిచేస్తున్న స్టాఫ్‌లో 12 శాతం మందిని ఇంటికి పంపించేయాలని సదరు మల్టీ నేషనల్ కంపెనీ నిర్ణయించిందనేది సారాంశం. పీసీలు (Personal Computers), ల్యాప్‌టాప్ మార్కెట్ ప్రస్తుతం అంత లాభదాయకంగా నడవడం లేదు.
హెచ్‌పీ కంపెనీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 4 వేల మంది నుంచి 6 వేల మంది వరకూ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని హెచ్‌పీ సంస్థ నిర్ణయించింది. హెచ్‌పీ సంస్థ మాత్రమే కాదు పీసీలకు డిమాండ్ తగ్గిపోవడంతో ఆ ప్రభావం చిప్-మేకర్ సంస్థ Intel Corp పై కూడా పడినట్లు తెలుస్తోంది. ఇంటెల్‌లో గత జులై నాటికి 1,13,700 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో వర్క్‌ఫోర్స్‌ను భారీగా తగ్గించుకోవాలని ఇంటెల్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. Intel కూడా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని సమాచారం. ఇంటెల్‌లోని సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలతో కలిపి మొత్తం 20 శాతం స్టాఫ్‌ను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఇంటెల్ యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది.