Oppo: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. 5జీ అప్‌డేట్స్ తీసుకొచ్చిన ఒప్పో

ABN , First Publish Date - 2022-11-15T16:39:24+05:30 IST

టెలికం సంస్థలు రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రారంభించిన 5జీ సేవలు

Oppo: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. 5జీ అప్‌డేట్స్ తీసుకొచ్చిన ఒప్పో

న్యూఢిల్లీ: టెలికం సంస్థలు రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రారంభించిన 5జీ సేవలు ఇప్పుడు మరిన్ని నగరాలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడీ ఫోన్లకు 5జీ రెడీ (5G) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల 5జీ సేవలను నేరుగా పొందే అవకాశం లభిస్తుంది.

తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) కూడా తమ 5జీ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఒప్పో రెనో 8 ప్రొ, ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 7, ఒప్పో ఎఫ్21 ప్రొ, ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో కే10, ఒప్పో ఎ53ఎస్‌ల కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడివి జియో స్టాండ్ ఎలోన్ (Standalone) నెట్‌వర్క్‌కు సిద్ధమయ్యాయి. తమ ఇతర 5జీ మోడల్స్‌కు కూడా త్వరలోనే 5జీ సపోర్ట్ తీసుకొస్తామని ఒప్పో (Oppo 5G Phones) ప్రకటించింది. ఈ సందర్భంగా ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ హెడ్ తస్లీఫ్ అరీఫ్ మాట్లాడుతూ.. జియో అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఒప్పో తీసుకొచ్చిన తాజా అప్‌డేట్‌తో 5జీ నెట్‌వర్క్ (5G Network) అందుబాటులో ఉన్న నగరాల్లోని యూజర్లు 5జీ అనుభవాన్ని పొందగలుగుతారని అరిఫ్ తెలిపారు. ఇకపై తమ నుంచి వచ్చే అన్ని 5జీ డివైజ్‌లు ఎస్ఏ, ఎన్ఎస్ఏకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. జియో ట్రూ 5జీ (Jio True 5G) ప్రపంచంలోనే అత్యంత అధునాతన తర్వాతి తరం వైర్‌లెస్ నెట్‌వర్క్ అని ఒప్పో పేర్కొంది. జియో ట్రూ 5జీ 4జీ నెట్‌వర్క్‌పై ఏమాత్రం ఆధారపడదని, 4జీ ఆధారిత ఎన్ఎస్ఏ నెట్‌వర్క్స్‌కి దీనికి చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది.

యూజర్లకు 5జీ రెడీ అప్‌డేట్స్‌ను అందించడంలో ప్రముఖ మొబైల్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, గూగుల్, ఆపిల్‌లను ఒప్పో బీట్ చేసింది. కాగా, యాపిల్ కూడా ఇటీవల తమ యూజర్ల కోసం బీటా ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది.

Updated Date - 2022-11-15T18:23:52+05:30 IST