Realme 10 Pro Plus: రియల్‌మి అభిమానులకు గుడ్‌న్యూస్.. 5జీ ఎనేబుల్డ్ ఫోన్లు లాంచ్!
ABN , First Publish Date - 2022-12-08T20:21:44+05:30 IST
దేశంలోని రియల్‌మి అభిమానులకు శుభవార్త చెబుతూ ఆ సంస్థ రెండు 5జీ ఎనేబుల్డ్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మి 10
న్యూఢిల్లీ: దేశంలోని రియల్‌మి అభిమానులకు శుభవార్త చెబుతూ ఆ సంస్థ రెండు 5జీ ఎనేబుల్డ్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మి 10 సిరీస్‌లో భాగంగా 10 ప్రొ 5జీ (Realme 10 Pro 5G), 10 ప్రొ ప్లస్ 5జీ (Realme 10 Pro Plus 5G)లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్వ్‌డ్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్లను వీటిలో ఉపయోగించారు. రియల్‌మి 10 ప్రొ ప్లస్ అత్యంత పలుచని బాటమ్ బేజెల్స్ కలిగిన కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుండగా, రియల్‌మి 10 ప్రొ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోంది.
రియల్‌మి 10 ప్రొ ప్లస్ 6జీబీ, 8జీబీ వేరియంట్లలో వస్తోంది 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ. 24,999 మాత్రమే. బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 25,999. రియల్‌మి 10 ప్రొ 6జీబీ+128జీబీ, 8జీబీ+128 జీబీ వేరియంట్లలో వస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, బ్యాంకు ఆఫర్లను ఉపయోగించి రూ. 17,999కే కొనుగోలు చేసుకోవచ్చు. 8జీబీ వేరియంట్ ధర రూ. 19,999. రియల్‌మి 10 ప్రొ ప్లస్ ఈ నెల 14 నుంచి అమ్మకానికి రానుండగా, రియల్‌మి10 ప్రొను డిసెంబరు 16 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రెండూ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
రియల్‌మి 10 ప్రొ ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 13 ఓస్, 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5జీ ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, అవసరమైతే 16 జీబీ వరకు ర్యామ్‌ను విస్తరించుకునే అవకాశం, వెనకవైపు 108 ఎంపీ శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై సపోర్ట్ ఫీచర్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రియల్‌మి 10 ప్రొ 5జీ స్పెసిఫికేషన్లు: 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ఎస్‌సీడీ డిస్‌ప్లే, 6ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ఎస్ఓసీ, 8జీ ర్యామ్, 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం, 108 మెగాపిక్సల్ శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ సెన్సార్, 128 ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 1టీబీ వరకు పెంచుకునే అవకాశం, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రిలయన్స్ జియో.. రియల్‌మి జట్టు
5జీ అనుభవం కోసం రిలయన్స్ జియోతో రియల్‌మి జట్టుకట్టింది. ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సీఈవో కిరణ్ థామస్ మాట్లాడుతూ.. తమ కీలక భాగస్వామి రియల్‌మితో మరో మైలురాయి భాగస్వామం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రియల్‌మి 10 ప్రొ ప్లస్ వంటి శక్తిమంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్ నిజమైన శక్తిని జియో వంటి ట్రూ 5జీ నెట్‌వర్క్ ద్వారా ఆవిష్కరించవచ్చని అన్నారు. జియో ట్రూ 5జీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అధునాతన నెట్‌వర్క్ అని పేర్కొన్నారు.