Bank Holidays: జనవరిలో బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య సమాచారం ఇదీ!
ABN , First Publish Date - 2022-12-21T20:41:05+05:30 IST
ఈ రోజుల్లో వ్యక్తులు లేదా వ్యవస్థల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకుల పాత్ర చాలా కీలకమైపోయింది. బ్యాంకులతో ముడిపడిన పనులు చాలానే ఉంటున్నాయి.
ముంబై: ఈ రోజుల్లో వ్యక్తులు లేదా వ్యవస్థల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకుల పాత్ర చాలా కీలకమైపోయింది. బ్యాంకులతో ముడిపడిన పనులు చాలానే ఉంటున్నాయి. అందుకే బ్యాంక్ హాలిడేస్‌పై ముందస్తు అవగాహనతో పనులు చక్కబెట్టుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఇలాంటి పరిస్థితే జనవరిలో ఎదురయ్యే అవకాశం ఉంది. పండగలు, ప్రత్యేక రోజుల కారణంగా బ్యాంక్ హాలిడేస్ సంఖ్య కాస్త ఎక్కువగా ఉండడం ఇందుకు కారణంగా ఉంది. ఈ మేరకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) జనవరి నెలలో బ్యాంక్ హాలిడేస్ (Bank Holidays) క్యాలెండర్‌ను ప్రచురించింది. జనవరిలో న్యూ ఇయర్ (New Year), స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల కారణంగా సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన జనవరి క్యాలెండర్ ప్రకారం.. మొత్తం 14 రోజులు బ్యాంక్ హాలిడేస్‌గా ఉన్నాయి. అయితే ఇవి అన్ని రాష్ట్రాలకు వర్తించవు. మరి ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఒక లుక్కేద్దాం...
జనవరి 2023లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే..
జనవరి 1: న్యూ ఇయర్ (అన్ని రాష్ట్రాలకు)..(ఆదివారం)
జనవరి 5: గురు గోవింగ్ సింగ్ జయంతి (హర్యానా, రాజస్థాన్)
జనవరి 11: మిషనరీ డే (మిజోరంలో మాత్రమే)
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి (రెండవ శనివారం)
జనవరి 15: సంక్రాంతి కనుమ (ఆదివారం)
జనవరి 22: సొనమ్ లాసర్ (సిక్కింకి మాత్రమే) (ఆదివారం)
జనవరి 23: నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి
జనవరి 25: రాష్ట్ర దినోత్సవం (హిమాచల్‌ప్రదేశ్‌కు మాత్రమే)
జనవరి 26: గణతంత్ర దినోత్సవం (అన్నీ రాష్ట్రాల్లో)
జనవరి 30 : మె-దామ్-మె-ఫి (అసోంలో మాత్రమే).
పైన పేర్కొన్న సెలవులు కాకుండా రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని బ్యాంకు సెలవుల సంఖ్య ఎక్కువగానే ఉంది.