Windows 11: విండోస్ 11 వాడుతున్నారా?.. మీకో కీలక అప్‌డేట్...
ABN , First Publish Date - 2022-10-30T19:01:52+05:30 IST
యూజర్ల అనుభూతిని మరింత పెంపొందించడమే లక్ష్యంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అడుగువేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ను కంప్యూటర్‌తో నేరుగా అనుసంధానించుకునేందుకు వీలుగా ‘ఫోన్ లింక్’ (Phone Link) అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.
యూజర్ల అనుభూతిని మరింత పెంపొందించడమే లక్ష్యంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అడుగువేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ను కంప్యూటర్‌తో నేరుగా అనుసంధానించుకునేందుకు వీలుగా ‘ఫోన్ లింక్’ (Phone Link) అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఈ మేరకు విండోస్ 11 ప్రివ్యూ బిల్డ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఇన్‌సైడర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న విండోస్ 11 ప్రివ్యూ బిల్డ్‌ను మైక్రోసాఫ్ట్ తొలగిస్తోందని విండోస్ సెంట్రల్ ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ పేర్కొంది. కొన్ని సమస్యల పరిష్కారం, కొత్త డెవలప్‌మెంట్లతో నూతన ప్రివ్యూ బిల్డ్‌ను రూపొందించిందని పేర్కొంది. కొత్త బిల్డ్‌లో ‘ఫోన్ లింక్ యాప్’ అప్‌డేట్‌లు ఉంటాయని తెలిపింది. కొత్త ఫీచర్ మ్యాక్‌ఓఎస్ మాదిరిగానే పనిచేస్తుందని, ఐఫోన్ హాట్‌స్పాట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చునని వెల్లడించింది. కాగా ఫోన్ ఫీచర్ ప్రస్తుతం వన్ యుఐ 4.1.1, అంతకంటే ఎక్కువ సామ్‌సంగ్ హ్యాండ్‌సెట్లపై మాత్రమే పనిచేస్తోన్న విషయం తెలిసిందే.