Gujarat results: బీజేపీ దూకుడుకి గుజరాత్‌ ఎన్నికల రికార్డులన్నీ బ్రేక్!

ABN , First Publish Date - 2022-12-08T12:35:06+05:30 IST

గుజరాత్ ఎన్నికలు-2022 ఫలితాల్లో (Gujatat election results) లెటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం.. 150కిపైగా స్థానాల్లో అధికార బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ విజయదుందుభి మోగించడం దాదాపు ఖరారైంది.

Gujarat results: బీజేపీ దూకుడుకి గుజరాత్‌ ఎన్నికల రికార్డులన్నీ బ్రేక్!

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలు-2022 ఫలితాల్లో (Gujatat election results) లెటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం.. 150కిపైగా స్థానాల్లో అధికార బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ విజయదుందుభి మోగించడం దాదాపు ఖరారైంది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో పలు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా 27 ఏళ్ల గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. 2002లో ఈ రికార్డ్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయమని ట్రెండ్స్ చెబుతున్నాయి. మరోవైపు 1985లో మాధవ్ సింగ్ సొలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డ్ స్థాయిలో 149 స్థానాల్లో గెలిచి రికార్డ్ స్థాయి మెజారిటీని సాధించింది. సామాజిక కూటమి ఖమ్ ( KHAM) (కోలి క్షత్రియ, హరిజన్, ఆదివాసి, ముస్లిం) ఏర్పాటు చేసిన సోలంకి అతి భారీ విజయాన్ని సాధించడంలో సఫలీకృతమయ్యారు. గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటీ అదే రికార్డుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీజేపీ చెరిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా గత 27 ఏళ్లుగా గుజరాత్‌ పాలిస్తున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలు 2017లో 99 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో చతికిలపడింది. 1985లో రికార్డ్ స్థాయి విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో అత్యంత చెత్త ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆప్ (AAP) ఇక్కడ ఖాతా తెరవడం ఖాయమైంది. ఆప్ పోటీ చేయడం కాంగ్రెస్ భారీ నష్టం చేసిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాగా ప్రస్తుత గుజరాత్‌ ఎన్నికల ఫలితాల ఈసీ గణాంకాల ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ ఓటు షేరు 55 శాతం, కాంగ్రెస్ 27 శాతం, ఆప్ 13.3 శాతంగా ఉన్నాయి.

Updated Date - 2022-12-08T14:55:14+05:30 IST