Gujarat Elections : పెళ్లి మండపం నుంచి పోలింగ్ బూత్‌కు... ఓటు హక్కు విలువను చాటిన నవదంపతులు...

ABN , First Publish Date - 2022-12-01T17:13:06+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుంది. ఓటు హక్కును వినియోగించుకుని సరైన ప్రజా ప్రతినిధిని

Gujarat Elections : పెళ్లి మండపం నుంచి పోలింగ్ బూత్‌కు... ఓటు హక్కు విలువను చాటిన నవదంపతులు...
Vabhav and Kavita

గాంధీ నగర్ : ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుంది. ఓటు హక్కును వినియోగించుకుని సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవచ్చు. ప్రస్తుత, భావి తరాల అభ్యుదయం కోసం సచ్ఛీలురైన ప్రజా ప్రతినిధుల అవసరం చాలా ఉంటుంది. అందుకే నవదంపతులు వైభవ్, కవిత పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు విలువను మరోసారి చాటి చెప్పారు.

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ బుధవారం జరిగింది. కచ్ జిల్లాలోని భుజ్ శాసన సభ నియోజకవర్గంలో నవ దంపతులు కవిత, వైభవ్ (Kavita and Vaibhav) పెళ్లి మండపం నుంచి నేరుగా 208వ నెంబరు పోలింగ్ బూత్‌కు వెళ్లి, ఓట్లు వేశారు.

కవిత, వైభవ్ అత్యంత ఆకర్షణీయమైన దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. పువ్వుల డిజైన్‌తో తళతళ మెరిసే తెల్లని లెహంగా, గోటా, జరీ వర్క్‌తో కూడిన ఆకుపచ్చని జాకెట్ (రవిక), సంప్రదాయబద్ధమైన ఎర్రని దుపట్టా ధరించారు. ఆమెకు సరిసాటిగా వైభవ్ కూడా ఆకర్షణీయమైన షేర్వానీ ధరించారు.

వీరిద్దరూ పోలింగ్ బూత్‌లోని సెక్యూరిటీ గార్డులతో కలిసి ఫొటో దిగారు. ఓటు హక్కు పట్ల వీరికిగల చైతన్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2022-12-01T17:13:12+05:30 IST