working for a long time: ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-10-28T13:07:09+05:30 IST

డెస్క్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం, సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేయడం వల్ల మన శరీరం, మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

working for a long time: ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నారా..?
Working for a long time

ఎక్కువ సేపు కూర్చోవడం, సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేయడం వల్ల మన శరీరం, మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వచ్చిపడతాయి.. అవేంటంటే..

ఎక్కువసేపు కూర్చుంటున్నారా..?

ఆరోగ్యకరమైన జీవితం కోసం మన శరీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. దినచర్యలో భాగంగా చేసే పనులన్నీ మెదడు మీద ప్రభావాన్ని చూపుతాయి. మనం తీసుకునే ఆహారం, మెదడుపై ఎంత ప్రభావాన్ని చూపుతుందో, మనం లేవడం, పడుకోవడం, నడిచే విధానం కూడా మెదడుపై ప్రభావము చూపుతాయి. దీనిలో భాగంగా ఆఫీసులో కూర్చునే విధానం మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

డెస్క్ లో కూర్చోవడం, పడుకోవడం వల్ల కాలి కండరాలు పని చేయవు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మన శరీరంలో రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన రక్తంలో ఫ్యాటీ యాసిడ్స్ పెరగడంతో పాటు జీవక్రియ మందగిస్తుంది. అంతేకాదు రక్తంలోని గ్లూకోజ్ కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

వ్యాయామం: శరీరానికి వ్యాయామం చాలా అవసరం. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే కూర్చో కుండా నిలబడి పనులు చేయాలి. ఎక్కువ సేపు నిలబడి ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక మార్గంగా చెప్పవచ్చు, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇది పనిచేస్తుంది.

ప్రతి 30 నిమిషాలకు కదలండి. ఆఫీసుల్లో రోజంతా పనివేళల్లో ఉండే ఉద్యోగులు పని సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కదులుతారని ఇది వారి మెదడు ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 15-20 అడుగులు నడవడం ముఖ్యం.

Updated Date - 2022-10-28T13:34:55+05:30 IST