Samantha: అనారోగ్యంతో ఇబ్బంది.. ఎట్టకేలకు క్లారిటీ!

ABN , First Publish Date - 2022-10-29T16:54:02+05:30 IST

సమంతకు ఏమైంది (Samantha) ఆరోగ్యం సరిగ్గానే ఉందా? అమెరికాలో ట్రీట్‌మెంట్‌ అట.. నిజమేనా? సోషల్‌ మీడియాకు ఎందుకు దూరంగా ఉంది? గత నెలన్నరగా సోషల్‌ మీడియాలో ఇదే చర్చ.

Samantha: అనారోగ్యంతో ఇబ్బంది.. ఎట్టకేలకు క్లారిటీ!

సమంతకు ఏమైంది (Samantha)

ఆరోగ్యం సరిగ్గానే ఉందా?

అమెరికాలో ట్రీట్‌మెంట్‌ అట.. నిజమేనా? 

సోషల్‌ మీడియాకు ఎందుకు దూరంగా ఉంది? 

గత నెలన్నరగా సోషల్‌ మీడియాలో ఇదే చర్చ.

తాజాగా దీనిపై సమంత స్పందించారు. ఒక్క ట్వీట్‌తో అందరికీ సమాధానమిచ్చింది. తాజాగా ఆమె నటించిన  ‘యశోద’ (Yashoda) సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోతోపాటు ఓ లేఖ రాశారు. అయితే సమంత చేతికి సెలైన్‌ ఉండటం గమనార్హం, 

‘‘యశోద’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా

నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్‌’(Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ (samantha autoimmune condition)సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు.  జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరొక్క రోజు కూడా ఇలా ఉండలేను.  ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత ట్వీట్‌ చేశారు. 

ప్రస్తుతం సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ‘ఖుషి’ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. 

Updated Date - 2022-10-29T18:58:21+05:30 IST