NRI: ఇలా జరుగుతుందని ముందే ఊహించా.. ఓ దొంగ నిర్వేదం.. అసలేం జరిగిందో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-12-23T21:03:33+05:30 IST
ఐప్యాడ్ దొంగిలించి పోలీసులకు చిక్కిన ఓ దొంగ..ఇలా జరుగుతుందని ముందే ఊహించా అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.
ఎన్నారై డెస్క్: ఐప్యాడ్ దొంగిలించి(Stolen IPad) పోలీసులకు చిక్కిన ఓ దొంగ..ఇలా జరుగుతుందని ముందే ఊహించా అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల(Florida) పామ్ బీచ్(Palm Beach) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ నిర్మాణ సంస్థలో చోరీ జరిగినట్టు పోలీసులు కొద్ది రోజుల క్రితం సమాచారం అందింది. కార్యాలయం అద్దాలు పగలగొట్టి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తులు దొంగిలించినట్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా పోయిన వస్తువుల్లో ఓ ఐప్యాడ్ కూడా ఉంది. అయితే.. ఐప్యాడ్ లొకేషన్‌ను గుర్తించే ఫైండ్‌మై యాప్(Find My App) కూడా అందులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా నిందితుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసంటూ నిందితుడు ట్రాయ్ లీ బెల్లామీ(62) పోలీసుల వద్ద వాపోయాడు. ఆ యాప్ తన లొకేషన్‌ను ట్రాక్ చేస్తోందన్న విషయం తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. కాగా.. నిందితుడిపై దోపిడీతో పాటూ పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా.. యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ల సాయంతో కెనడా పోలీసులు ఇటీవల అపహరణకు గురైన ఓ కారు ఆచూకీ పట్టుకోగలిగారు. కొంత కాలం లోర్నే అనే వ్యక్తికి చెందిన ఓ కారును క్రితం దొంగలు ఎత్తుకుపోయారు. కారు ఆచూకీని ఎవరూ ట్రాక్ చేయకుండా ఉండేందుకు అందులో ఉన్న ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సమీపంలోని ఓ సరస్సులో పడేశారు. దీంతో.. లోర్నే ఈ మారు జాగ్రత్తపడి తన కొత్త కారుకు యాపిల్ ఎయిర్ ట్యాగ్‌లను అమర్చారు. ఫైండ్ మై యాప్ సాయంతో దాని లొకేషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఇక లోర్నే రెండో కారు కూడా చోరి అవగా.. స్థానిక పోలీసులు ఫైండ్ మై యాప్ సాయంతో దాన్ని కనుగొన్నారు.