USA: ఆ కంపెనీ నాదే.. నా కంపెనీలో నేనే దొంగతనం చేశా..

ABN , First Publish Date - 2022-11-26T22:00:13+05:30 IST

ఫ్లోరిడా రాష్ట్రం గెయినిస్‌విల్ నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు చివరకు పోలీసులకే ఊహించని షాకిచ్చాడు.

USA: ఆ కంపెనీ నాదే.. నా కంపెనీలో నేనే దొంగతనం చేశా..

ఫ్లోరిడా: ఫ్లోరిడా రాష్ట్రం(Florida) గెయినిస్‌విల్ నగరంలోని(Gainesville) వాల్‌మార్ట్‌ స్టోర్‌లో(Walmart) దొంగతనానికి(Steals) పాల్పడ్డ నిందితుడు చివరకు పోలీసులకే ఊహించని షాకిచ్చాడు. పోలీసులకు చిక్కిన అతడు వాల్‌మార్ట్ తనదేనని చెప్పడంతో వారు ఒక్కసారిగా షాకైపోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. స్టీవెన్ ఫ్రాన్సిస్(Steven Francis) అనే వ్యక్తి ఆ సూపర్ మార్కెట్ స్టోర్ నుంచి 200 డాలర్ల విలువైన దుస్తులను ఎత్తుకుపోతూ సీసీకెమెరాకు చిక్కాడు. విషయం పోలీసులకు చేరడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు వాల్‌మార్ట్ తనదేనంటూ(Owns Walmart) చెప్పుకొచ్చాడు. తన సంస్థలో తానే దొంగతనం చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించాడు. అంతా విన్నాక పోలీసులు అతడిపై దొంగతనం కేసు నమోదు చేశారు.

కాగా.. ఇటీవలే కోరీ జాన్సన్ అనే మరో వ్యక్తి..బ్రెవార్డ్ కౌంటీలోని ఆర్మీ స్థావరంలోకి చొరబడేందు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. గ్రహాంతర వాసులు వస్తున్నారని అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు ఇలా చేశానని అతడు చెప్పుకొచ్చాడు. అతడు ఓ వాహాన్ని కూడా ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు దొంగతనం కేసు కూడా నమోదు చేశారు.

Updated Date - 2022-11-26T23:47:16+05:30 IST