NRI: అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నార్త్ అమెరికా సీమాంధ్రా అసోసియేషన్
ABN , First Publish Date - 2022-12-19T17:13:08+05:30 IST
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆ లెజెండరీ నేత, నటుడి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవం కోసం NJలోని ఎడిసన్ సిటీలో స్థలం కేటాయించేందుకు ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలిపారని నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ పేర్కొంది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 2023లో ఆ లెజెండరీ నేత, నటుడి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవం కోసం NJలోని ఎడిసన్ సిటీలో(Edison City) స్థలం కేటాయించేందుకు ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలిపారని నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ పేర్కొంది. ఇటీవల ఎడిసన్ నగరంలో ఆ ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నార్త్‌అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ చొరవ చూపింది. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత టీ.జీ విశ్వప్రసాద్ శతాబ్ది ఉత్సవాలల్లో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రతిపాదించారు. దీనికి అమెరికాలోని తెలుగు అభిమానులను మద్దతుగా నిలిచారు.
ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఈ క్రమంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఆదేశాల మేరకు న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్ మరియు పసిఫిక్ ద్వీపవాసుల కమిషన్ కమిషనర్ సాకేత చదలవాడ, ఎడిసన్ న్యూజెర్సీ నగరం సాంస్కృతిక మరియు కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, నగర్ మేయర్‌తో కలిసి విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించేందుకు కృషి చేశారు.
యునైటెడ్ స్టేట్స్‌లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే. ఈ దిశగా NASAA (నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) నిధులు సమకూరుస్తోంది. ఎడిసన్ నివాసితులతో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. శ్రీ అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు రవి పొట్లూరి, ఇతర వాలంటీర్లు తమ తోడ్పాటును అందించారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మొదటి వరుసలో ఉండి, యూఎస్ఏలోని ఎన్టీఆర్ విగ్రహం ద్వారా తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పేందుకు కృషి చేస్తున్నారు.