NRI: వీసాజారీ ప్రక్రియ వేగవంతం..వచ్చే ఏడాదికల్లా సాధారణ పరిస్థితులు..

ABN , First Publish Date - 2022-11-19T23:54:21+05:30 IST

వీసా జారీ ప్రక్రియ వేగవంతమవుతోందని అమెరికా విదేశాంగశాఖ తాజాగా పేర్కొంది.

NRI: వీసాజారీ ప్రక్రియ వేగవంతం..వచ్చే ఏడాదికల్లా సాధారణ పరిస్థితులు..

ఎన్నారై డెస్క్: వీసా జారీ ప్రక్రియ(Visa Processing) వేగవంతమవుతోందని అమెరికా విదేశాంగశాఖ(State Department) తాజాగా పేర్కొంది. వీసాదరఖాస్తుల పరిష్కారానికి నోచుకోకుండా పేరుకు పోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ‘‘ ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా వెయిటింగ్ టైం(Waiting Time) తగ్గించడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతోంది. అమెరికా ఫారిన్ సర్వీసెస్ సిబ్బందిని రెట్టింపు సంఖ్యలో నియమించుకుంటున్నాము. కాబట్టి.. ఊహించినదానికంటే ఎక్కువగా వీసా ప్రక్రియ వేగం పుంజుకుంది(Speed Up). వచ్చే ఏడాది కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.’’ అని విదేశాంగ శాఖ గురువారం పేర్కొంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వీసాదరఖాస్తుదారులు వ్యక్తిగతంగా(In Person) హాజరుకావాల్సి ఉంటుంది. అయితే.. స్థానిక కరోనా ఆంక్షల కారణంగా ఈ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడి జాప్యానికి దారితీసిందని విదేశాంగ శాఖ వివరించింది. ‘‘దీంతో..తక్కువ సంఖ్యలో వీసాదరఖాస్తులను పరిశీలించాల్సి వచ్చేది. ప్రస్తుతం అనేక దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తేశాయి. దీంతో.. మా రాయబార కార్యాలయాల్లో(Consular Offices) 96 శాతం..మునుపటి స్థాయిలో వీసాసేవలను అందించగలుగుతున్నాయి’’ అని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా టూరిస్ట్ వీసా కోసం వెయింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది.

Updated Date - 2022-11-20T07:16:53+05:30 IST