US Winter storm: మంచు తుపాన్ ప్రభావం...15వేల విమానాల రద్దు
ABN , First Publish Date - 2022-12-27T08:50:20+05:30 IST
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్ వల్ల అమెరికా దేశంలో 15వేల విమానాలను రద్దు చేశారు....
వాషింగ్టన్ : అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్ వల్ల మృతుల సంఖ్య 60కి పెరిగింది.(Winter storm) బఫెలో నగరంలో మంచు తుపాన్ ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు.(US) ఈ మంచు వల్ల అమెరికా దేశంలో 15వేల విమానాలను రద్దు చేశారు.(Flights Cancelled) ఈ తుపాన్ వల్ల అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు హైలిఫ్ట్ ట్రాక్టర్లను మోహరించారు. ఈ మంచు తుపాన్‌ను ఈ శతాబ్దపు విపత్తుగా ప్రకటించారు.క్రిస్మస్ వారాంతంలో పశ్చిమ న్యూయార్క్ స్తంభించింది.బఫెలో చుట్టూ మంచుతో కప్పి ఉన్న ప్రాంతాన్ని తవ్వే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు.
రోడ్‌వేలు కార్లు, బస్సులు, అంబులెన్సులు, టో ట్రక్కులతో నిండిపోయాయి.మంగళవారం పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల మేర మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్(National Weather Service) తెలిపింది.వాతావరణ మార్పుల సంక్షోభం తుపాను తీవ్రతకు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బఫెలో నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు మొత్తం 49.2 అంగుళాలు (1.25 మీటర్లు) నమోదైందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.బుధవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.