FIFA Quarterfinal : సూపర్ బ్రెజిల్.. అదిరే అర్జెంటీనా
ABN , First Publish Date - 2022-12-09T00:54:18+05:30 IST
ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్.. ఆరో కప్ వేటలో టాప్ గేర్‌లో సాగుతోంది. తొలి క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. గత టోర్నీ రన్నరప్
నేడు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు
సాకర్ అభిమానులకు సూపర్ ఫ్రైడే..! నెమార్, మెస్సీలు తమ ఆటతో కిక్కెక్కించనున్నారు. శుక్రవారం జరిగే తొలి క్వార్టర్స్‌లో క్రొయేషియాతో బ్రెజిల్ అమీతుమీ తేల్చుకోనుండగా.. అర్ధరాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను అర్జెంటీనా ఢీ కొట్టనుంది.
దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్.. ఆరో కప్ వేటలో టాప్ గేర్‌లో సాగుతోంది. తొలి క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గాయం నుంచి కోలుకొని నెమార్ రీఎంట్రీ ఇవ్వగా.. రిచర్లిసన్, వీనీసియస్ లాంటి ఉడుకు రక్తంతో బ్రెజిల్ దూకుడుగా కనిపిస్తోంది. మరోవైపు వెటరన్ ఆటగాళ్లతో క్రొయేషియా కొంత కష్టంగా క్వార్టర్స్ బెర్త్ దక్కించుకొంది. మోద్రిచ్ కేంద్రకంగా జట్టు ఆట సాగుతున్నా.. అటాకింగ్ బలహీనంగా ఉంది. వరల్డ్‌కప్‌లో ఇరుజట్లూ రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ బ్రెజిల్ నెగ్గింది.
మెస్సీ X డచ్ డిఫెన్స్
వరల్డ్‌కప్ ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. సెమీ్‌సలో చోటు కోసం జరిగే మ్యాచ్‌లో మూడుసార్లు ఫైనలిస్టు డచ్ టీమ్‌తో రెండుసార్లు చాంపియన్ అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, మ్యాచ్ మొత్తం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ.. నెదర్లాండ్ డిఫెన్స్ మధ్యే ప్రధానంగా నడిచే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఇరుజట్లూ ఐదుసార్లు తలపడగా, చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గాయి. ఓ మ్యాచ్ డ్రా అయింది.