NewZealand vs India: అదరగొట్టిన మహ్మద్ సిరాజ్.. భారత్ లక్ష్యం ఎంతంటే ?
ABN , First Publish Date - 2022-11-22T14:35:21+05:30 IST
సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లు రాణించారు. ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌ను (NewZealand vs India) భారీ స్కోరు చేయకుండా నిలువరించారు.
నేపియర్: సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లు రాణించారు. నేపియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌ను (NewZealand vs India) భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా పేసర్లు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj), అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కివీస్ బ్యాటర్లను పెవీలియన్ పంపించారు. దీంతో 19.4 ఓవర్లలోనే 160 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 161 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్:
ఫిన్ అలెన్ (3), డెవోన్ కాన్వే (59), మార్క్ చాప్‌మ్యాన్ (12), గ్లెన్ ఫిలిప్స్ (54), డారిల్ మెచెల్ (10), జేమ్స్ నీషమ్ (0), మెచెల్ సాంట్నర్ (1), ఆడమ్ మిల్నే (0), ఇషా సోధి (0), టిమ్ సౌథీ (), లూకీ ఫెర్గుసన్ () చొప్పున పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. మహ్మద్ సిరాజ్ ఒక రనౌట్ కూడా చేశారు.