టెస్టు కెప్టెన్సీకి కేన్ గుడ్‌బై
ABN , First Publish Date - 2022-12-16T00:13:58+05:30 IST
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్ వైదొలిగాడు. దీంతో టిమ్ సౌథీని ఈ ఫార్మాట్‌లో నూతన సారథిగా కివీస్ క్రికెట్
టిమ్ సౌథీకి బాధ్యతలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్ వైదొలిగాడు. దీంతో టిమ్ సౌథీని ఈ ఫార్మాట్‌లో నూతన సారథిగా కివీస్ క్రికెట్ నియమించింది. టామ్ లాథమ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇకనుంచి కేన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే కొనసాగనున్నాడు. పని ఒత్తిడిలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన విలియమ్సన్.. పరిమిత ఓవర్లలో మాత్రం నాయకుడిగా ఉంటాడు. 2016లో తొలిసారి బాధ్యతలు తీసుకున్న కేన్ సారథ్యంలో కివీస్ 40 టెస్టుల్లో 22 మ్యాచ్‌లు నెగ్గగా 8 డ్రాలు, 10 ఓటములున్నాయి. గతేడాది ఆరంభ వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌పను జట్టుకు అందించిన కేన్.. కివీస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్లలో రెండోవాడిగా నిలిచాడు.