India-New Zealand : వన్డేలనూ వదలని వర్షం

ABN , First Publish Date - 2022-11-28T00:43:24+05:30 IST

భారత్‌-న్యూజిలాం డ్‌ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్‌ సిరీ్‌సలను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌ తరహాలోనే ఆదివారం జరిగిన రెండో వన్డే కూడా వర్షం దోబూచు

India-New Zealand : వన్డేలనూ వదలని వర్షం

కివీస్‌తో రెండో మ్యాచ్‌ రద్దు

భారత్‌ 89/1

హామిల్టన్‌: భారత్‌-న్యూజిలాం డ్‌ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్‌ సిరీ్‌సలను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌ తరహాలోనే ఆదివారం జరిగిన రెండో వన్డే కూడా వర్షం దోబూచు లాటతో రద్దయింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో 12.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్‌ గిల్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 నాటౌట్‌), సూర్యకుమార్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. కెప్టెన్‌ ధవన్‌ (3)ను ఆరో ఓవర్‌లో హెన్రీ అవుట్‌ చేశాడు. మ్యాచ్‌ రద్దవడంతో భారత్‌ ఈ సిరీస్‌ గెలిచే చాన్స్‌ కోల్పోయింది. బుధవారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ధవన్‌ సేన గెలిస్తే సిరీస్‌ 1-1తో సమమవుతుంది.

రెండుసార్లు ఆటంకం: ఉదయం కురిసిన వర్షంతో మైదానం చిత్తడి కావడంతో టాస్‌ కూడా ఆలస్యమైంది. రెండో మ్యాచ్‌లోనూ కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లలో గిల్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. ధవన్‌ మాత్రం డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఈ తరుణంలో 4.5 ఓవర్ల దగ్గర భారీవర్షం కురవగా మ్యాచ్‌ నాలుగు గంటలపాటు ఆగిపోయింది. తర్వాత ఆటను 29 ఓవర్లకు కుదించారు. కానీ ఆదిలోనే ధవన్‌ వికెట్‌ కోల్పోగా గిల్‌కు జతగా సూర్యకుమార్‌ కలిశాడు. అడపాదడపా బౌండరీలతో ఈ జోడీ జోరు చూపింది. ఇక 13వ ఓవర్‌లో సూర్య 6,4తో ఊపు మీదుండగా మళ్లీ భారీ వర్షంతో అంతా పెవిలియన్‌ చేరారు. 40 నిమిషాలు వేచిచూసినా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

స్కోరుబోర్డు

భారత్‌: ధవన్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) హెన్రీ 3; గిల్‌ (నాటౌట్‌) 45; సూర్య (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 12.5 ఓవర్లలో 89/1; వికెట్‌ పతనం: 1-23; బౌలింగ్‌: సౌథీ 3-0-12-0; హెన్రీ 4-0-20-1; ఫెర్గూసన్‌ 2.5-0-24-0; బ్రేస్‌వెల్‌ 2-0-18-0; శాంట్నర్‌ 1-0-9-0.

Updated Date - 2022-11-28T00:43:39+05:30 IST