Ishan kishan: ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ స్పందన.. ఒకే ఒక్క మాట..

ABN , First Publish Date - 2022-12-11T17:25:13+05:30 IST

బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టిన యంగ్‌బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు (Ishan kishan) అభినందనలు వెల్లువెత్తున్నాయి. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Ishan kishan: ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ స్పందన.. ఒకే ఒక్క మాట..

ముంబై: బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టిన యంగ్‌బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు (Ishan kishan) అభినందనలు వెల్లువెత్తున్నాయి. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) కూడా చేరిపోయాడు. ద్విశతకం సాధించిన ఇషాన్‌ కిషన్‌కు ప్రత్యేకంగా ఒక నోట్ రాశాడు. ‘‘ ఈ క్లబ్‌లో మజాయే వేరు, ఇషాన్ కిషన్’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ రాసుకొచ్చాడు. ఈ నోట్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోకి ఇషాన్ కిషన్‌కు స్వాగతం పలికాడు.

కాగా.. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వడంతో బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో ఇషాన్‌ కిషన్‌‌కు చోటు దక్కింది. ఓపెనర్‌గా వచ్చిన కిషన్ కేవలం 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇషాన్ కిషన్ పలు రికార్డులను సాధించాడు. వన్డేల్లో తొలి సెంచరీనే డబుల్‌గా మలిచిన ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు భారత్‌ తరఫున డబుల్‌ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్‌‌కు రోహిత్‌ (3), సెహ్వాగ్‌, సచిన్‌ తెందుల్కర్ ఈ ఫీట్‌ను సాధించారు. మొత్తంగా వన్డేల్లో డబుల్ చేసిన 7వ అంతర్జాతీయ ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. మరోవైపు అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగానూ ఇషాన్ కిషన్ నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును తుడిపేశాడు.

డబుల్ సెంచరీ సాధించడంపై ఇషాన్ స్పందిస్తూ.. బ్యాటింగ్‌ చేసేందుకు వికెట్‌ చాలా సహకరించిందని చెప్పాడు. బంతి కనిపిస్తే కొట్టాలన్న లక్ష్యంతో ఆడానని, భారత దిగ్గజాల సరసన తన పేరుండడం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశాడు. తాను అవుటయ్యే సమయానికి మరో 14 ఓవర్లున్నాయని, క్రీజులో ఉండివుంటే 300 కూడా కొట్టేవాణ్ణిని దీమా వ్యక్తం చేశాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేద్దామనుకున్నా.. కానీ కోహ్లీ సూచనతో సింగిల్స్‌ ద్వారా రాబట్టానని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.

Updated Date - 2022-12-11T17:25:18+05:30 IST