Google Navigation: గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ గురించి తెలుసా..

ABN , First Publish Date - 2022-12-16T21:06:45+05:30 IST

ఆశ్చర్యపరిచే వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇందులోని ప్రతి అంశం ఓ అద్భుతమే..

Google Navigation: గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ గురించి తెలుసా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం గూగుల్ నావిగేషన్(Navigation Feature) వాడని వాళ్లంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా మన జీవితాల్లో ఈ గూగుల్ ఫీచర్ల్ భాగమైపోయింది. కొత్త ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రతిఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది మ్యాప్స్(Google Maps) యాప్‌యే. అయితే.. ఈ యాప్ వినియోగంలోనూ అప్పడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా.. మ్యాప్‌లో మన లొకేషన్‌ను సూచించే చిన్న చుక్క మనతో పాటూ అనుకున్న ప్రకారం కదలకపోతే ఇబ్బందులు తప్పవు. ఎక్కడున్నామో..ఎటువైపు వెళ్లాల్లో తెలీక చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కుడివైపు తిరుగు..ఎడమవైపు వెళ్లు..దక్షిణదిక్కుగా పయనించు అని గూగుల్ నావిగేషన్‌లో వచ్చే సూచనలతోనూ ఒక్కోసారి తిప్పలు తప్పవు. మన అవసరాలకు తగ్గట్టుగా జీపీఎస్ సామర్థ్యం ఉండకపోవడమే దీనికి కారణం. అయితే.. ఈ సమస్యలన్నిటీకి గూగుల్ ఒక్కసారిగా చెక్ పెట్టేసింది.

ఫోన్లోని జీపీఎస్‌‌కు కెమెరాను జోడిస్తూ ‘విజువల్ పొజిషనింగ్ సిస్టమ్(వీపీఎస్-Visual positioning system)’ పేరిట రూపొందించిన ఈ నావిగేషన్ వ్యవస్థ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. కెమెరాను వినియోగిస్తూ మరింత సులభమైన నావిగేషన్‌ను అందించడమే వీపీఎస్ లక్ష్యం. కెమెరా సాయంతో ఎప్పటికప్పుడు పరిసరాలను రియల్‌టైంలో గుర్తించి కచ్చితమైన మార్గదర్శకాలను స్క్రీన్‌పైనే చూడవచ్చు. ఎటువంటి తికమకకు తావుడంని సిస్టమ్ ఇది. గూగుల్ స్ట్రీట్ వ్యూ(Street ‪View) ఆధారంగా ఈ కొత్త నావిగేషన్ రూపొందించడంతో.. ఏదైనా భవనానంవైపు కెమెరా ఫోకస్ చేస్తే చాలు అ భవనంలో ఏయే షాపులు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతాయి. అంతేకాదు.. స్క్రీన్‌పై కనిపించే ఓ కార్టూన్ క్యారెక్టర్ మనం వెళ్లాల్సిన దశను మరింత కచ్చితంగా చెబుతుంది.

Updated Date - 2022-12-16T21:06:45+05:30 IST