5G Service: కొంపముంచుతున్న 5G మోజు.. బ్యాంకు ఖాతాలు ఖాళీ!
ABN , First Publish Date - 2022-12-31T12:05:43+05:30 IST
ఎట్టకేలకు 5G నెట్‌వర్క్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ నెట్‌వర్క్ ఇంకా విస్తరించకపోయినా.. కొన్ని ముఖ్య పట్టణాల్లో జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel 5G) టెలికాం..
ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు 5G నెట్‌వర్క్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ నెట్‌వర్క్ ఇంకా విస్తరించకపోయినా.. కొన్ని ముఖ్య పట్టణాల్లో జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel 5G) టెలికాం కంపెనీలు ఈ సర్వీసులను ప్రారంభించాయి. 4G తో పోల్చితే.. 5G నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటున్నందున.. చాలా మంది 5G నెట్‌వర్క్‌ను పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హడావిడిలో తాము నివసించే ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిందా రాలేదా అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇవి కూడా చదవండి:
Viral News: పెళ్లైన మరుసటి రోజే భార్యపై భర్త పోలీస్ కంప్లైంట్.. ఫిర్యాదు ఏంటంటే..!
Viral News: మహిళకు యాజమాన్యం షాక్.. ప్రెగ్నెంట్ అని చెబితే జాబ్ నుంచి తీసేశారు!
అయితే.. సాధారణ ప్రజల్లోని ఈ ఉత్సహం, అమాయకత్వాన్ని సైబర్ నేరగాళ్లు(Cyber Crime) క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. టెలికాం కంపెనీలు పంపినట్టుగా.. వాట్సప్ తదితర మాధ్యమాల ద్వారా ప్రజలకు మెసేజ్ పంపుతున్నారు. 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు మెసేజ్ ద్వారా పంపిన లింక్‌ను క్లిక్ చేయాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రజలు ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో వాళ్లకు సంబంధించిన బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. దీంతో కేటుగాళ్లు.. బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ విషయం టెలికాం సంస్థలు కూడా గుర్తించాయి. ఈ క్రమంలోనే కేటుగాళ్ల వలలో పడకుండా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.