Vijay Devarakonda Liger : 'లైగర్‌' పెట్టుబడులకు, రాజకీయ నేతల లింకులపై ఈడీ ఫోకస్‌

ABN , First Publish Date - 2022-12-02T20:39:12+05:30 IST

లైగర్‌ (Liger) సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే లైగర్‌ సినిమా నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), సహనిర్మాత చార్మి, హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)ను ఈడీ ప్రశ్నించింది.

Vijay Devarakonda Liger : 'లైగర్‌' పెట్టుబడులకు, రాజకీయ నేతల లింకులపై ఈడీ ఫోకస్‌

హైదరాబాద్‌: లైగర్‌ (Liger) సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే లైగర్‌ సినిమా నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), సహనిర్మాత చార్మి, హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)ను ఈడీ ప్రశ్నించింది. పూరి కనెక్ట్‌, ఎల్‌ఎల్‌పీకి రూ.40 కోట్ల నగదు బదిలీపై ఈడీ ఆరా తీస్తోంది. 100 బినామీ అకౌంట్ల నుంచి నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. 'లైగర్‌'కు విదేశాల నుంచి రూ.10 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించారు. అలాగే లైగర్‌ సినిమాకు విజయ్‌ తక్కువ రెమ్యూనరేషన్‌పై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 'లైగర్‌' పెట్టుబడులకు, రాజకీయ నేతలకు ఉన్న లింకులపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. దాదాపుగా రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో లైగర్ చిత్రాన్ని రూపొందించారు. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, చార్మీ (Charmee)లకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు.

లైగర్‌ చిత్రం నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులపై అందిన ఫిర్యాదు మేరకు ఈడీ విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌, సహ నిర్మాత చార్మీ, విజయ్‌ దేవరకొండకు ఈడీ ఇప్పటికే విచారించారు. ఈ సినిమాలో పెట్టుబడులు.. పారితోషకాలు, చెల్లింపులు, సినిమా వసూళ్లు తదితర అంశాలపై ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఒకప్పటి హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ అయిన మైక్‌టైసన్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. లైగర్‌ సినిమాలో రాజకీయ నాయకులు అక్రమ పద్ధతిలో పెట్టుబడులు పెట్టారని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కోణంపైనా విజయ్‌ దేవరకొండను ప్రశ్నించినట్లు తెలిసింది.

Updated Date - 2022-12-02T20:39:13+05:30 IST