బీజేపీ కార్యకర్తలాగా గవర్నర్‌: మంత్రి జగదీశ్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-11-15T02:30:06+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని, రాజ్‌భవన్‌ బీజేపీ రెండో ఆఫీసుగా మారిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

బీజేపీ కార్యకర్తలాగా గవర్నర్‌: మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని, రాజ్‌భవన్‌ బీజేపీ రెండో ఆఫీసుగా మారిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కానీ సీఎం కేసీఆర్‌ ఉన్నంతవరకు రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. సోమవారం 69 అసిస్టెంట్‌ ఇంజనీర్లు, 178 సబ్‌ ఇంజనీర్లకు ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డిలతో కలిసి ఆయన నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఇప్పటివరకు గుజరాత్‌ వెళ్లకపోయినా.. ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ పథకాల పట్ల ఆసక్తిగా ఉన్నారని, అం దుకే బీజేపీకి కోపం అని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-11-15T02:30:07+05:30 IST