Directorate of Enforcement: రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-12-16T15:45:59+05:30 IST

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (MLA Rohit Reddy)కి ఈడీ నోటీసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో బెంగళూరులోని గోవర్థనపుర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.

Directorate of Enforcement: రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులో సంచలన విషయాలు

హైదరాబాద్: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (MLA Rohit Reddy)కి ఈడీ నోటీసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో బెంగళూరులోని గోవర్థనపుర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. కలహర్‌రెడ్డి అనే వ్యాపారితో కలిసి రోహిత్‌రెడ్డి పార్టీకి వెళ్లారని, అలాగే సినీ నిర్మాత శంకర్‌గౌడ ఇచ్చిన పార్టీలో కూడా ఆయన పాల్గొన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. నైజీరియన్ల నుంచి రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పార్టీకి చేరినట్లు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ తీసుకున్న మస్తాన్, శంకర్‌గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ కేసులో హీరో తనీష్‌ (Hero Tanish)ను కూడా బెంగళూరు పోలీసులు విచారించారు.

రోహిత్‌రెడ్డి, హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh)కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమాచారమిచ్చారు. ఈడీ నోటీసులు అందాయని, ఆధార్‌, ఓటర్ ఐడీతో పాటు.. ఆర్థిక లావాదేవీల పత్రాలను విచారణకు తీసుకురావాలని కోరారని, 19న ఈడీ విచారణకు హాజరవుతా రోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఈడీ నోటీసులపై న్యాయవాదులతో రోహిత్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-12-16T15:46:22+05:30 IST