Bank Holidays in June: పండుగలేమీ పెద్దగా లేవు కానీ.. జూన్ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు..!

ABN , First Publish Date - 2023-06-01T15:20:24+05:30 IST

జూన్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే..

Bank Holidays in June: పండుగలేమీ పెద్దగా లేవు కానీ.. జూన్ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు..!

ఇంటర్నెట్ డెస్క్: జూన్ నెల వచ్చేసింది. ఈ నెలలో పెద్దగా పండుగలేమీ లేవు కానీ స్థూలంగా చూస్తే ఈ మారు 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆదివారం, రెండు, నాలుగో శనివారాలతో పాటూ కొన్ని పండుగల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవుల్లో మార్పులు ఉంటాయి కాబట్టి ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. అప్పుడే ఎటువంటి అవాంతరాలు లేకుండా బ్యాంకు పనులు పూర్తి చేసుకోవచ్చు. మరి జూన్‌లో ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో చూద్దాం పదండి!

  • జూన్ 4: ఆదివారం

  • జూన్ 10: రెండవ శనివారం

  • జూన్ 11: ఆదివారం

  • జూన్ 15: వై. ఎమ్. ఏ డే/ రాజ సంక్రాంతి(మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

  • జూన్ 18: ఆదివారం

  • జూన్ 20: కాంగ్ రథయాత్ర(ఒడిశా, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)

  • జూన్ 24: నాలుగవ శనివారం

  • జూన్ 25: ఆదివారం

  • జూన్ 26: ఖర్చీ పూజు( త్రిపురలో బ్యాంకులకు సెలవు

  • జూన్ 28: బక్రీద్ (మహారాష్ట్ర, కేరళ, జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు

  • జూన్ 29: బక్రీద్ (మహారాష్ట్ర, కేరళ, జమ్ము, శ్రీనగర్‌ మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)

  • జూన్ 30: ఈద్ ఉల్ జుహా(మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

Updated Date - 2023-06-01T15:40:22+05:30 IST