Gold Price: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 08:38 AM
గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు(Gold Price Today) ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
ఢిల్లీ: గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు(Gold Price Today) ఇవాళ స్వల్పంగా తగ్గాయి. బంగారం ఇష్టపడే మగువలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గురువారం హైదరాబాద్(Hyderabad)లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56 వేల 650 ఉండగా.. తులం(10 గ్రాముల) 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800గా ఉంది.
విశాఖపట్నంలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,950గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,650, 24 క్యారెట్ల ధర రూ.61వేల 800గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.77 వేలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ.75వేలు, చెన్నైలో రూ.77వేలు, బెంగళూరులో కిలో రూ.72,700గా ఉంది. వీటి ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ లకు అనుగుణంగా మారుతుంటాయి.