Share News

Gold Rate: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

ABN , First Publish Date - 2023-12-11T09:00:50+05:30 IST

మగువలకు గుడ్ న్యూస్. వారికి ఎంతో ఇష్టమైన బంగారం ధరలు(Gold Prices) స్వల్పంగా తగ్గాయి. నిన్న దిగొచ్చిన ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Rate: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

ఢిల్లీ: మగువలకు గుడ్ న్యూస్. వారికి ఎంతో ఇష్టమైన బంగారం ధరలు(Gold Prices) స్వల్పంగా తగ్గాయి. నిన్న దిగొచ్చిన ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు వివరాలు ఇవే...

వారం రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర తగ్గగా.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ ధరలు పెరిగే అవకాశమూ లేకపోలేనందునా వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


హైదరాబాద్ మార్కెట్లో నిన్న ఒక్క రోజే గోల్డ్ ప్రైజ్ భారీగా తగ్గింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ.62,350 పలుకుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,300 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.62,500 పలుకుతోంది.

దిగివస్తున్న వెండి ధరలు..

ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరిన సిల్వర్ ధరలు(Silver Prices) తాజాగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ కిలో వెండి ధర రూ.78వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రూ.2వేలు దిగొచ్చింది. ఢిల్లీలో రూ.76 వేల మార్క వద్ద కొనసాగుతోంది.

Updated Date - 2023-12-11T09:00:53+05:30 IST