Jio Plus: మొత్తం కుటుంబానికి జియో గుడ్ ‌న్యూస్.. అందరికీ ఒకే ప్లాన్!

ABN , First Publish Date - 2023-03-14T22:02:55+05:30 IST

జియో ప్లస్(Jio Plus) స్కీమ్‌లో రిలయన్స్ జియో(Reliance Jio) కొత్త ఫ్యామిలీ పోస్టుపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. ఇందులో ఒక ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్,

Jio Plus: మొత్తం కుటుంబానికి జియో గుడ్ ‌న్యూస్.. అందరికీ ఒకే ప్లాన్!

ముంబై: జియో ప్లస్(Jio Plus) స్కీమ్‌లో రిలయన్స్ జియో(Reliance Jio) కొత్త ఫ్యామిలీ పోస్టుపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. ఇందులో ఒక ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వీటిలో కొన్ని అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్, ఇతర ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్లాన్‌ను పరీక్షించేందుకు కుటుంబంలో నలుగురికి నెల రోజులపాటు ఉచిత ట్రయల్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ నెల 22 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి.

జియో ప్లస్ పోస్టుపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు

రూ. 399 జియో పోస్టుపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలతోపాటు 75 జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 699 జియో పోస్టుపెయిడ్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో 100 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఒక్కో ప్లాన్‌లో ఒక్కొక్కరు ముగ్గురు సభ్యులను జోడించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్లు ఉచిత ట్రయల్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. రెండో ప్లాన్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 875 చెల్లించాల్సి ఉంటుంది.

జియో ప్లస్ పోస్టుపెయిడ్ వ్యక్తిగత ప్లాన్లు

రూ. 299 జియో ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 30 జీబీ మొత్తం డేటా, అపరమిత ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు లభిస్తాయి. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్యాక్‌తో ఎలాంటి ఫ్రీ ట్రయల్ ఉండదు. రూ. 599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇందులో ఒక నెల ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ.750.

జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, ఇప్పటికే ఉన్న నాన్-జియో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 70000 70000 నంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌లు అందుకోవచ్చు. అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు పొందొచ్చు. పోస్ట్‌పెయిడ్ సిమ్ కోసం వినియోగదారులు ఉచిత హోమ్ డెలివరీ ఎంపికను కూడా బుక్ చేసుకోవచ్చు. హోం డెలివరీ సమయంలో వినియోగదారుడు మరో మూడు ఫ్యామిలీ సిమ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, యాక్టివేషన్ సమయంలో ఒక్కో సిమ్‌కార్డుకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మాస్టర్ (Main) ఫ్యామిలీ సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత జియో యాప్ ద్వారా మిగతా ముగ్గరి కుటుంబ సభ్యులను మీ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రీపెయిడ్ వినియోగదారులైతే సిమ్‌ను మార్చకుండానే పోస్ట్ పెయిడ్ ట్రయల్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు. ఇందుకోసం మై జియో యాప్‌కి వెళ్లి ‘ప్రీపెయిడ్ టు పోస్ట్‌పెయిడ్‌’పై క్లిక్ చేయలి. అనంతరం ఓటీపీ( OTP) ధ్రువీకరణను పూర్తి చేసి ఉచిత ట్రయల్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. అయితే, ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-03-14T22:03:07+05:30 IST