Redmi Note 13: రెడ్ మీ యూజర్లకు గుడ్ న్యూస్.. నోట్ 13 ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:57 AM
రెడ్ మీ(Xiaomi) ఇండియన్ యూజర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దాని తదుపరి బ్రాండ్ అయిన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ని భారత్ లో విడుదల చేసే తేదీని ప్రకటించింది.
ఢిల్లీ: రెడ్ మీ(Xiaomi) ఇండియన్ యూజర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దాని తదుపరి బ్రాండ్ అయిన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ని భారత్ లో విడుదల చేసే తేదీని ప్రకటించింది. శియామీ రెడ్ మి నోట్ 13 ప్రో ప్లస్ ని జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. జనవరి 4న ఈ మొబైల్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్ మి నోట్ 13 ప్రో ప్లస్, రెడ్ మి నోట్ 13 ప్రొ, నోట్ 13 సిరీస్ లను కంపెనీ సెప్టెంబర్ లో చైనాలో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి 13 ప్రొ ప్లస్ ని మాత్రమే భారత్ లో విడుదల చేయాలనే ఆలోచనతో ఉంది రెడ్ మి.
విశేషాలివే...
రెడ్‌మి నోట్ 13 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6080 SoC 12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ ని కలిగిఉంటుంది. దీనికి ఉన్న డ్యూయల్ కెమెరాలో 100 మెగాపిక్సల్స్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరా 16 మెగా పిక్సెల్ సెన్సార్ తో ఉంటుంది. ఇది 33 వాట్ల వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
రెడ్‌మి నోట్ 13 ప్రొ, నోట్ 13 ప్రొ + 120 Hz రిప్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో 6.67 అంగుళాల 1.5 K AMOLED ప్యానెల్ ను కలిగి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 13 ప్రొ Qualcomm Snapdragaon 7s Gen 2 ప్రాసెసర్ ని కలిగి ఉంటది. ప్రొ + మాత్రం MediaTek Dimenstity 7200 Ultra ప్రాసెసర్ ని కలిగి ఉంది. రెండు ఫోన్లు గరిష్ఠంగా 16 జీబీ ర్యామ్, 512 జీబీ రోమ్ లను కలిగి ఉన్నాయి.
ఇవి 5,100 బ్యాటరీతో వస్తాయి. 13 ప్రొ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. 13 ప్రొ + 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ నిస్తుంది. ఈ రెండు ఫోన్లు కెమెరాపరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 200 మెగాపిక్సెల్ శామ్ సంగ్ ఐసోసెల్ హెచ్ పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్ ని కలిగి ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగా పిక్సెల్ సెన్సార్, వెనకవైపు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.
ధరలు..
రెడ్‌మి నోట్ 13 ధర రూ.14,000
రెడ్‌మి నోట్ 13 ప్రొ రూ.17,000
రెడ్‌మి నోట్ 13 ప్రొ + రూ.23,000